పోస్ట్‌లు

allu arjun trivikram srinivas deshamuduru ileana devisri prasad dvv danaiah universal movies tollywood movie news movie reviews movie gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అల్లు, త్రివిక్ర‌మ్‌ల సినిమా సెట్‌పైకి

చిత్రం
అల్లు అర్జున్, తివిక్రమ్ కాంబినేషన్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్య్రకమాలు సెప్టెంబర్ 24న జ‌ర‌గ‌నున్నాయి.. అల్లు అర్జున్ ఆపరేషన్ నిమిత్తం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న కారణంగటా అక్టోబర్ మొదటి వారంలో ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు. ఇందులో అల్లు అర్జున్ సరసన గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా ఎంపికయింది. ఆర్య,బన్ని, ఆర్య2 లాంటి మ్యూజికల్ హిట్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అల్లు అర్జున్ తో దేశ ముదురు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన దానయ్య, ఎస్. రాధాకృష్ణ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పంచ్ డైలాగులు చెప్పడంలో బన్నీకి ఓ స్టైల్ ఉంది. పంచ్ డైలాగులు చెప్పించడంలో త్రివిక్రమ్ కి ఓ స్టైల్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.