పోస్ట్‌లు

telangana nagara samithi telangana rashtra samithi trs tns kcr ktr ngr tdp congress party political news political articls hot news hot articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తెలంగాణ న‌గారా స‌మితి వ‌చ్చింది

చిత్రం
ప్ర‌త్యేక తెలంగాణ కోసం ఇప్పుడు మ‌రో వేదిక ఏర్పాట‌యింది.. అదే తెలంగాణ న‌గారా స‌మితి. ఈ వేదిక‌ని ఏర్పాటు చేసింది నాగం జ‌నార్థ‌న్‌రెడ్డి. టిడిపి పార్టీతో తెగ‌తెంపులు చేసుకున‌రి ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కోసం ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ న‌గారా స‌మితి, తెలంగాణ రాష్ట్ర స‌మితికి పోటీగా మారుతుందా అన్న ప్ర‌శ్న‌లు ప్ర‌స్తుతం త‌లెత్తుతున్నాయి.. అయితే తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌య‌సు ప‌ది సంవ‌త్స‌రాలు. ఈ ప‌ది సంవ‌త్స‌రాల కాలంలో ఎన్నో ఒడిదుడుకుల‌ని త‌ట్టుకుని, ఎన్నో విజ‌యాల‌ని, అప‌జ‌యాల‌ని చ‌విచూసి కెసీఆర్ అధ్య‌క్ష‌త‌ను ప‌ది సంవ‌త్స‌రాల పాటు దిగ్విజ‌యంగా రావ‌డం విశేషం. మ‌రి ఈ టిఆర్ ఎస్ లాగానే టి ఎన్ ఎస్ (తెలంగాణ న‌గారా స‌మితి) కూడా దిన దిన ప్ర‌వ‌ర్థ‌మాన‌మై ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్ర స‌మితిని ఢీకొంటుందా.. అప్పుడెప్పుడో న‌వ‌తెలంగాణ పార్టీ అంటూ కొత్త పార్టీని తెచ్చిన దేవేంద‌ర్ గౌడ్ మాదిరిగా కొద్ది రోజుల‌కే పెట్టే బేడా స‌ర్దేసుకుని తిరుగు ముఖం ప‌డుతుందా అన్న‌ది చూడాలి.