ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా దీపావళి పండుగని దేశం యావత్తూ జరుపుకున్నారు.. కానీ.. పాపం.. ఆ నలుగురు నాయకులు మాత్రం.. ఆత్మీయులకి, ఆప్తులకి దూరంలో, ఖైదీల మధ్య దీపావళి పండుగని జరుపుకున్నారు. ఇంతకీ వారు ఎవరనే కదా.. యడ్యూరప్ప, ఏ.రాజా, కనిమొళి, గాలి జనార్థన్‌రెడ్డి. వీళ్లంతా పేరు మోసిన రాజకీయ నేతలు. ఆయా రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ఇందులో ఒకరు సీఎంగా పనిచేసిన వ్యక్తైతే మరొకరు మాజీ సీఎం ముద్దుల కుమార్తె. ఇంకొకరు కేంద్రమంత్రిగా బాధ్యతలు వెలగబెట్టారు. మరొకరు రాష్ట్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది. టూజీ స్పెక్ట్రమ్ కేసులో చిక్కుకొని కేంద్రమాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి విలవిలలాడుతున్నారు. లేటెస్ట్‌గా కనిమొళి బెయిల్ పిటీషన్‌పై విచారించిన సీబీఐ కోర్టు కరుణ గారాల పట్టికి బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని వచ్చేనెల 3న నిర్ణయించనుంది. దీంతో కనిమొళి కూడా కటకటాల వెనుకే కలర్‌ఫుల్ దివాళీ జరుపుకోనున్నారు. టూజీ స్పెక్ట్రమ్ కేసులో నిందితుడిగా ఉన్న ఏ.రాజా కూడా...