పోస్ట్‌లు

ramgopal varma bejawada roudy nagachaitanya shobharani political news political articls tollywood movies tollywood movie reviews movie gossips hot news hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప‌ట్టు వీడిన రాంగోపాల్ వ‌ర్మ

చిత్రం
ఎట్టకేలకు విజయవాడవాసుల డిమాండ్ కు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తలొగ్గారు. బెజవాడలోని రౌడీల కథాంశంతో తెరకెక్కిస్తున్న బెజవాడ రౌడీలు సినిమా పేరుమార్పునకు అంగీకరించారు. ఈ సినిమా పేరు మార్చాలని కొన్ని నెలలుగా విజయవాడ నగర ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. పేరు మార్చనిదే అక్కడ సినిమా షూటింగ్ కూడా జరగనివ్వకుండా చేయగలిగారు. దీంతో వారికి అక్కడి రాజకీయనేతలు కూడా వంతపాడాల్సి వచ్చింది. వారి కోరిక మేరకు బెజవాడరౌడీలు పేరు కాస్త బెజవాడగా మారింది. ఇక సినిమా స్టోరీపై ఎలాంటి ఊహాగానాలు వస్తాయో లేక సినిమా రిలీజయ్యాక అక్కడ ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

టైటిల్ మార్చే ప్రస‌క్తే లేదు..!

చిత్రం
తన లెటేస్ట్ ఫిల్మ్.. బెజవాడ రౌడీలు సినిమా టైటిల్ వివాదంపై రామ్ గోపాల్ వర్మ తొలిసారి నోరు విప్పారు. సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చిన ఆయన.. ఎన్టీవీతో మాట్లాడుతూ.. బెజవాడ రౌడీలు టైటిల్ ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టైటిల్ ను మార్చుతానని.. తానెప్పుడూ ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని.. లగడపాటికి కూడా ఈ విషయంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని వర్మ అన్నారు. టైటిల్ గురించి ఎందుకంత పట్టుబడుతున్నారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. వర్మ మాట్లాడుతూ.. తనకు పాతికేళ్లుగా విజయవాడ తెలుసని.. బెజవాడ చరిత్రేంటో తనకంతా తెలుసునని చెప్పారు. తాను చరిత్రను వక్రీకరించడం లేదని.. తన ఉద్దేశ్యమేంటో.. సినిమా చూసిన తర్వాత తెలుస్తుందని వర్మ చెప్పుకొచ్చారు. అసలు ఈ టైటిల్ వివాదం ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు. తానిప్పటికీ అదే టైటిల్ కు కట్టుబడి ఉన్నానని వర్మ స్పష్టం చేశారు. టైటిల్ పై మరో ఆలోచనేది లేదని వర్మ అన్నారు. సినిమాలో ఏ వర్గాన్ని కానీ.. ఎవ్వరినీ కానీ అగౌరవపర్చడం లేదని.. స్పష్టం చేశారు. కాగా బెజవాడ రౌడీలు సినిమా కోసం తొలిసారి విజయవాడకు వచ్చిన ఆయన.. చివరిరోజు షూటింగ్ లో పాల్...