టైటిల్ మార్చే ప్రస‌క్తే లేదు..!


తన లెటేస్ట్ ఫిల్మ్.. బెజవాడ రౌడీలు సినిమా టైటిల్ వివాదంపై రామ్ గోపాల్ వర్మ తొలిసారి నోరు విప్పారు. సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చిన ఆయన.. ఎన్టీవీతో మాట్లాడుతూ.. బెజవాడ రౌడీలు టైటిల్ ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టైటిల్ ను మార్చుతానని.. తానెప్పుడూ ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని.. లగడపాటికి కూడా ఈ విషయంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని వర్మ అన్నారు. టైటిల్ గురించి ఎందుకంత పట్టుబడుతున్నారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. వర్మ మాట్లాడుతూ.. తనకు పాతికేళ్లుగా విజయవాడ తెలుసని.. బెజవాడ చరిత్రేంటో తనకంతా తెలుసునని చెప్పారు. తాను చరిత్రను వక్రీకరించడం లేదని.. తన ఉద్దేశ్యమేంటో.. సినిమా చూసిన తర్వాత తెలుస్తుందని వర్మ చెప్పుకొచ్చారు. అసలు ఈ టైటిల్ వివాదం ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు. తానిప్పటికీ అదే టైటిల్ కు కట్టుబడి ఉన్నానని వర్మ స్పష్టం చేశారు. టైటిల్ పై మరో ఆలోచనేది లేదని వర్మ అన్నారు. సినిమాలో ఏ వర్గాన్ని కానీ.. ఎవ్వరినీ కానీ అగౌరవపర్చడం లేదని.. స్పష్టం చేశారు. కాగా బెజవాడ రౌడీలు సినిమా కోసం తొలిసారి విజయవాడకు వచ్చిన ఆయన.. చివరిరోజు షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమాకు ఆయన నిర్మాతగా ఉన్నా.. గౌరవ దర్శకత్వం చేస్తున్నారు. కృష్ణానది ఒడ్డున ఓ పాట చిత్రీకరణ సాగుతోంది. నాగచైతన్యతో చేస్తున్న ఈ సాంగ్ కూడా విజయవాడకు సంబంధించినదని చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!