వరంగల్లులో సమైఖ్యాంధ్ర నాదం..
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై తెలుగుదేశం సీనియర్ నేత పయ్యవుల కేశవ్ ధ్వజమెత్తారు. ఇక కేసీఆర్ పని అయిపోయిం దని కేశవ్ అన్నారు. రాజకీయంగా కేసీఆర్ ఆరిపోయే దీపం అని పయ్యావుల వ్యాఖ్యానిం చారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగినట్లే.. త్వరలోనే కేసీఆర్ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలుగుతుందని పయ్యావుల ఫైర్ అయ్యారు. పంచడం ముసుగులో కేసీఆర్ కు.. దండుకోవడం తెలుసంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ఒప్పుకోమన్న పయ్యావుల.. త్వరలోనే సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. అవసరమైతే.. వరంగల్లులోనే సమైక్యాంధ్ర సమావే శాలు నిర్వహిస్తామని పయ్యావుల చెప్పుకొచ్చారు. కాగా తెలంగాణపై చంద్రబాబు చిత్తశుద్ది తేలిపోయిందని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఓ వైపు త్వరలో ఎన్నికలు వస్తాయని చంద్రబాబు అంటు న్నారు.. మరోవైపు తెలంగాణ వచ్చేదాక ఎన్నికల్లో పోటీచేయమని తెలుగుదేశం తెలంగాణ నేతలు అంటు న్నారని.. ఇందులో ఏది వాస్తవమని ఈటెల ప్రశ్నించారు. సమైక్యవాదుల కార్యాచరణ చూస్తుంటేనే.. చంద్ర బాబుకు తెలంగాణపై ఉన్న చిత్తశుద్ది తేటతెల్లమవుతుందని ఈటెల వ్యాఖ్యానించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి