మన్మోహన్‌ని కలిసిన సీమాంధ్రనాయకులు
తెలంగాణపై అనేక వాద,ప్రతివాదన తర్వాత శ్రీకృష్ణ కమిటీ తన సిఫారస్ లు చేసిందని, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచుతరన్న విషయంలో తాము ప్రభుత్వంపై, పార్టీ నమ్మకంతో ప్రశాంతంగా ఉన్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలియచేశామని మంత్రి శైలజానాద్ చెప్పారు. కొందరు తెలంగాణ నాయకులు చేస్తున్న ప్రకటనలను కూడా వారి దృష్టికి తీసుకు వెళ్లామని అన్నారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, ఇది చాలా జటిలమైన సమస్య అని, గులాం నబీ అజాద్ చూస్తున్నారని, వారికి కూడా ఈ విషయాలను తెలియ చేస్తామని ప్రధాని అన్నారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రిని సుమారు అరగంటకు పైగా సీమాంధ్ర నేతలు కలసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రెండువేలనాలుగు సంవత్సరంలో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయం కూడా ప్రధానికి గుర్తు చేశామని శైలజానాధ్ అన్నారు. ఈ అంశంపై తీర్పు ఇవ్వవలసిందిగా శ్రీకృష్ణ కమిటీని వేశారని, ఆ కమిటీ తీర్పును అమలు చేయాలని కోరటానికి వచ్చామని అన్నారు.సీమాంధ్ర నేతల తరపున ఏలూరు ఎమ్.పి కావూరి సాంబశివరావు, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్ .రవీంద్ర రెడ్డి ప్రధానికి రాష్ట్రం ఐక్యం ఉండవల సిన అవసరం గురించి వివరించారని ఆయన తెలిపారు.మనమంతా కాంగ్రెస్ కుటుంబానికి చెందినవారమని, అంతా క్రమశిక్షణతో ఉండాలని ప్రధాని కోరారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తాము విన్నవించామని, రాయలసీమలో తొంభై శాతం మంది, ఆంద్రలో ఎనభై ఐదు శాతం మంది, తెలంగాణలో నలభై ఐదు శాతంమంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు.శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటును తెలంగాణ నేతలు ఎప్పుడూ వ్యతిరేకించలేదని మంత్రి శైలజానాద్ చెప్పారు.అన్ని ప్రాంతాల సెంటిమెంటును అర్ధం చేసుకున్నామని ప్రధాని అన్నారని కూడా ఆయన అన్నారు. కాగా తెలంగాణ నేతలు కూడా వచ్చి చర్చలు జరపాలని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. శాంతియుతంగా ఉండాలని కేంద్ర నేతలు కోరుతున్నారని, అలా అయితే చర్చలు కొనసాగుతాయని అన్నారు.88 మంది ప్రజాప్రతినిధులు ప్రధానిని కలిశామని, మంత్రులు ఇరవైమూడు మంది రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరామని గాదె వెంకటరెడ్డి తెలిపారు.తెలంగాణ నేతలు లేవనెత్తిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించారని, ఇంకా ఏమైనా ఉంటే చర్చించి పరిష్కరించవచ్చని గాదె అన్నారు.రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి లేదని, రాజీనామాలు పెండింగులో ఉన్నాయని గాదె అన్నారు.పరిపాలన నడుస్తూనే ఉందని ఆయన చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి