టిడిపిని చీల్చ‌డానికి కుట్ర జ‌రుగుతోంది..

తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె.ఎర్రన్నాయుడు ఆరోపించారు.ఢిల్లీ నేతలకు చంద్రబాబే ఎప్పుడూ కలలోకి వస్తాడని, ఆయనను దెబ్బతీయడానికి ఉత్తరాది నాయకులు రాష్ట్రాన్ని చీల్చడానికి కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం చీలిపోతే ఆంద్రప్రదేశ్ గుర్తింపు ఉండదని, చిన్న రాష్ట్రంగా మారితే ఉత్తరాది వారికి ఎదురు ఉండదని, అందుకే ఈ చీలిక కుట్ర అని ఎర్రన్నాయుడు ఆయన అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఈసమస్యకు పుల్ స్టాప్ పెట్టాలని కూడా ఎర్రన్నాయుడు డిమాండు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై దమ్ముంటే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ సీమాంద్ర నేతల సదస్సు సవాలు చేసింది. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సదస్సులో మాట్లాడుతూ శాసనసభలో కనుక తీర్మానంపై రహస్య ఓటింగ్ పెడితే, రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే అభిప్రాయమే వస్తుందని ఆయన అన్నారు.కాగా మరో నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ, ఆంధ్రులు కర్నూలు రాజధానిని త్యాగం చేశారని, అలాగే గుంటూరులో హైకోర్టు త్యాగం చేశారని, దూడను మేతవేసి పెంచి పెద్ద చేశాక పాలు మావని చెప్పి దూడని తెలంగాణ నేతలు లాక్కుంటున్నారని విమర్శించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!