అన్ని వార్తలు ఒకలా ఉండవు
indian News,India Latest News | News, Hollywood news, Bollywood news, political satires,Movie News, News Portal, Music, Movie News, Hollywood,
IT news portal providing latest Information Technology news
జగన్ కేసులో సరికొత్త మలుపు
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కి చెందిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టినవారు ప్రభుత్వం నుంచి ప్రయో జనాలు పొందడం వల్లనే పెట్టారా? ఇది ఎలా నిరూపించాలి? దీనిపై ఎవరు ఆధారాలు ఇవ్వాలి? సాక్షి మీడియా కు చెందిన ప్రతినిధులు చేసిన ఒక సరికొత్త వాదన తెరపైకి తెచ్చిందని తెలిసింది. సాక్షి మీడి యాలోకాని,జగన్ ఇతర కంపెనీలలోకాని పెట్టుబడులు పెట్టినవారెవరికైనా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు చేకూరాయా? అందుకే పెట్టుబడులు పెట్టారా అన్నది ప్రభుత్వం నుంచే సమాచారం తీసుకోవాలని సిబిఐ వద్ద విచారణకు హాజరైన సాక్షి వైస్ ఛైర్మన్ విజయసాయిరెడ్డి, వై.ఇ. ప్రసాదరెడ్డి సిబిఐకి స్పష్టం చేయడంతో ఇది కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వం అధికారికంగా సాక్షిలో పెట్టుబడులు పెట్టినందుకే వారికి భూములు కేటాయించామనో, లేక జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టినందుకే ఫలానా ప్రయోజనం కలిగించామని ప్రభుత్వాన్ని చెప్పమనండని వీరు సిబిఐకి చెప్పారు.ప్రభుత్వం ఎవరికైనా భూములు కేటాయించిందా? లేదా అన్నది తమకు సంబందించిన అంశం కాదని,ఎవరి హయాంలో భూములు కేటాయించారన్నది తమకు సంబంధం లేదని, తాము, తమకు సన్నిహితంగా ఉన్నవారిలో పలువురిని ఆసక్తి ఉంటే పెట్టుబడులు పెట్టమని కోరామని, వారిలో కొందరు ఇష్టపడి పెట్టారని విజయసాయి రెడ్డి సిబిఐకి తెలిపారు.దాదాపు ఎనిమిది గంటల సేపు సిబిఐ వద్ద ఉన్న వీరు తమ సంస్థలలో పెట్టుబడిన కంపెనీలు, వాటికి సంబందించిన ఆధారాలు మొదలైనవి ఒక్కక్కటి, నిబంధనలు వివరిస్తూ, వాటికి అనుగుణంగా ఉన్న పత్రాలను చూపుతూ తమ వాదనను వివరించారు.ఒక దశలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొంత స్పష్టత లోపించాయని సిబిఐ అదికారులు భావించినట్లు చెబుతున్నారు.అధికార దుర్వినియోగం రుజువు చేయడం ఎలా సాధ్యమవుతుందా అన్నదానిపై వీరు దృష్టి పెట్టవలసి వస్తోంది. అధికార దుర్వినియోగం వల్లనే పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు ఏ కంపెనీ ఒప్పుకోదు. అలాగే ప్రభుత్వం కూడా అందుకే వారికి లాభం చేశామని చెప్పదు. అయితే ఎవరైనా జగన్ కు ఎదురు తిరిగి చెప్పదలిస్తే తప్ప ఇది ఎలా రుజువు అవుతుందన్నది అర్ధం కాని పరిస్థితి ఏర్పడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.ఒక కంపెనీ పెట్టుబడులు పెట్టాలంటే నాలుగు రకాల డాక్యుమెంట్లు ఉండాలి. పాన్ కార్డు, ఆదాయపన్ను కట్టి ఉండడం, బ్యాంక్ స్టేట్ మెంట్, ఫిక్స్ డ్ డిపాజిట్ ఉంటే సంబంధిత పత్రాలు ఉండాలి. వాటన్నిటిని వీరు సమర్పించారు. అలాగే కోల్ కోత కం.పెనీలు కొన్ని ఎలా పెట్టుబడులు పెట్టాయో, మారిషస్ రూట్ లో నిదులు వచ్చినదానిపై కూడా వివరణ ఇచ్చారు. దేశంలో అనేక కంపెనీలకు డబ్బు వస్తోందని, ఒకవేళ అందులో ఏదైనా లోపం ఉంటే విచారణ చేసుకోవచ్చని వీరు స్పష్టం చేశారు.ఇక భారతీ సిమెంట్స్ లో పెట్టుబడులు పెట్టినవారందరికి ఎంత లాభం చేకూరిందో వివరిస్తూ వారికి చెల్లించిన డ్రాఫ్ట్ ల కాపీలు కూడా చూపించారు. ఉదాహరణకు ఒక కంపెనీ 275కోట్ల పెట్టుబడి పెడితే , దానికి 425 కోట్ల మేర తిరిగి చెల్లించారు. అలాంటప్పుడు అధికార దుర్వినియోగమనో, లేక ఇంకోటనో ఎలా అంటారని వీరు ప్ఱశ్నించారు.పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు సంబంధించి ఎక్కడా లోపాలు జరగలేదని సమాచారం ఇవ్వడంలో సఫలీకృతులమయ్యామని జగతి పబ్లికేషన్స్ వర్గాలు భావిస్తున్నాయని సమాచారం.కొందరు వ్యక్తులు పెట్టిన పెట్టుబడులకు సంబందించి కూడా ఇలాగే ఆధారాలు ఇవ్వగలిగితే జగన్ కు ఇబ్బంది ఉండదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.జగన్ ఆస్తులపై విచారణ జరపాలని మంత్రి శంకరరావు హైకోర్టుకు లేఖ రాయడం ,ఆ కేసులో టిడిపి నేతలు ఎర్రన్నాయుడు, ఇతరులు ఇంప్లీడ్ అవడం తెలిసిన సంగతే. మరి సిబిఐ దీనని ఎలా తేల్చగలుగుతుందో చూడాలి.
ఈ శతాబ్దం నాదీ అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీకి ఒక శతాబ్దం నిండింది. మహాకవి 101వ జయంతి (శనివారం- 30-04-11) వేడుకల సందర్భంగా ఓసారి ఆ మహాకవిని స్మరించుకుందాం. .. కవితా మహర్షి మరో శతాబ్దిలోకి తన చైతన్యకాంతులను ప్రసరింపజేస్తున్నాడు. పాత పదాలకు కొత్త అర్థం కల్పించి కవిత్వానికి దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ . `ఆధునిక కవిత్వం అర్థంకాలేదంటే, ఆధునిక జీవితమే అర్థం కాలేదన్నమాట' అంటూ మోడర్న్ భావాలకు పెద్దపీట వేసిన దీర్ఘదర్శి మహాకవి శ్రీశ్రీ. అందుకేనేమో `పదండిముందుకు, పదండి తోసుకు '- అంటూ మరో ప్రపంచాన్ని ముందస్తుగానే చూపించాడు శ్రీశ్రీ. `రాబోవు యుగం నా యుగం అవుతుంది' అంటూ శాసించిన మహాకవి శ్రీశ్రీ. 1930 వరకు తెలుగుసాహిత్యం తనను నడిపిస్తే, ఆ తరువాత దాన్ని తానే నడిపించానంటూ సగర్వంగా చెప్పుకున్నవాడు శ్రీశ్రీ. అనతికాలంలోనే మహాకవిగా ఎదిగి తెలుగుసాహిత్యంలో మధ్యాహ్న భానుడిలా ప్రకాశించాడు శ్రీశ్రీ. `శ్రీశ్రీకంటే మిన్న- ఏదైనా వుంటే, అది శ్రీశ్రీ కవితే సుమా'- అన్నంతగా శ్రీశ్రీ కవితలు జనహృదయాల్లో నాటుకుపోయాయి. `భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను... స్మ...
దోమల శృంగారంపై పూర్తి అవగాహన ఉంటే, డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా, నిజమేనంటున్నారు అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలోని జీవరసాయన శాస్త్రవేత్తలు. ఆడెస్ ఈజిప్టీ దోమల సెక్స్ లో ఒక రకమైన రసాయన చర్యల పట్టికను శాస్త్రవేత్తలు గుర్తించారు. మగదోమ స్పెర్మ్ లో ఉండే వంద రకాల ప్రొటీన్లు ఆడదోమల్లోని లక్షణాల్లో శాశ్వత ప్రాతిపదికన మార్పులు తీసుకువస్తాయి. అవి ఆహారం (రక్తం) తీసుకునే విషయంలోనూ, అండాలను విడుదల చేయడంలోనూ, కలయక పద్ధతుల్లోనూ ఈ మార్పులు కొట్టొచ్చినట్టు కనబడతాయట. మగ దోమల్లో అంతకు ముందు కూడా కొన్ని రకాల ప్రొటీన్లు గుర్తించినా, సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఏ తరహా ప్రొటీన్లు ఆడదోమలోకి స్పెర్మ్ ద్వారా పోతున్నాయో ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. ఈ ప్రొటీన్లను స్పష్టంగా గుర్తించడం వల్ల రాబోయే కాలంలో ఆడ దోమలు పుట్టకుండా చేయడానికి వీలుచిక్కుతుందనీ, అప్పుడు డెంగ్యూ, వెస్ట్ నిలే వంటి వైరస్ ల వల్ల మనుషుల్లో జ్వరాలు రాకుండా చూడవచ్చని కార్నెల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు సంగతేమిటం...
బర్నింగ్ కామెంట్రీ - 5 .................................................. నగ్న పాచికల జూదం!! వయసువెన్నెల్లో తడిసి మెరిసిన సింగారం కాసుల కోసం `షార్ట్'కట్స్ లో వెండితెరపై ఆరేసిన అందం చూసేవాళ్ల కంటిమీద గ్యారెంటీగా కునుకు దూరం! ఇది నేడు హిట్ ల కోసం ఆడే నగ్న పాచికల జూదం!! ...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి