ఆగ్రహిస్తే అల్లక‌ల్లోలం సృష్టించ‌బ‌డుతుంది..

ప్రజ‌ల ఆగ్రహావేశాలు, అపార్థాల‌తో చేసే త‌ప్పులే అల్లక‌ల్లోలాల‌ని సృష్టిస్తున్నాయ‌ని రంగంలో అమ్మవారు తెలిపారు.  కాగా అంతకుముందు అల్లకల్లోలానికి కారణం ప్రజల తప్పులే కారణమని అమ్మవారు తెలు పుతూ రంగం భవిష్యత్తును స్వర్ణలత చెప్పారు. మీలో మీరు కొట్టుకుంటు న్నారని అన్నారు. ఆలయానికి సరైన కట్టడం సైతం లేదన్నారు. అందుకే మీకు ఇన్ని కష్టాలని చెప్పారు. నేను పెట్టేదాన్నే కానీ కొట్టేదాన్ని కాదని అన్నారు. ప్రజలు ధనం, మదంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలు తప్పులు చేసినప్పటికీ వారిని సరిదిద్ది కాపాడుతానని అన్నారు. నేను ఆగ్రహించడం లేదన్నారు. ఆగ్రహిస్తే అల్లకల్లోలమవుతుం దన్నారు. నా బిడ్డలందరినీ కాపాడతానని చెప్పారు. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. నా ప్రజలు సంతోషంగా ఉండటమే నాకు సంతోషం అన్నారు. నా వాళ్లు కష్టాలు పడకుండా కుంభవృష్టి కురిపిస్తానని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చేస్తానని అన్నారు. కాగా రంగం అనంతరం పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

తెలంగాణ గురించి నోరువిప్పని అమ్మవారు..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై అమ్మవారు ఏమీ చెప్పలేదు.. ఇదే విష‌యాన్ని సికింద్రాబాద్ ఎం.పి. అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌ని అడిగితే.. తాము అమ్మవారిని ప్రత్యేక రాష్ట్రం గురించి అడ‌గ‌లేద‌ని అందుకే అమ్మ వారు చెప్పలేద‌ని అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్యమాలు, బంద్‌ల పేరుతో అత‌లాకుత‌లం చేస్తున్న ఈ ప్రత్యేక తెలంగాణ స‌మ‌స్యని అమ్మవారి ముందు ఉంచ‌క‌పోవ‌డం భ‌క్తుల‌తో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!