ఇక బిజెపి వంతు..!

సీమాంధ్రలో త్వరలో జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపడతామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరు పేట నియోజ కవర్గం శాసనసభ్యుడు జి.కిషన్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ప్రత్యే కాంధ్ర కోసం త్వరలో ఆందోళనలు చేపడతామని అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలంగాణకు వ్యతి రేకం కాదన్నారు. సీమాంధ్రులు కేవలం భద్రత కోసమే భయపడుతున్నారని అన్నారు. భయపడు తున్న సీమాంధ్రులకు భద్రత కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ‌ లోని సీమాంధ్ర పెట్టుబ‌డి దారులు కేవ‌లం వారి భ‌ద్రత‌కోసం భ‌య‌ప‌డుతున్నార‌ని కిష‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జై ఆంధ్రా ఉద్యమాన్ని తీవ్రత‌రం చేయ‌డ‌మే కాకుండా ఇటు తెలంగాణ‌ లోనూ త‌మ ఉద్యమాన్ని కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ‌, స‌మైఖ్యాంధ్ర ఉద్యమాల పుణ్యమా అని రాష్ట్రంలో ప‌ట్టు కోల్పోయిన టిడిపి, బిజెపి పార్టీలు మ‌ళ్లీ పుంజుకోవ‌డానికి చ‌క చ‌కా పావులు క‌దుపుతున్నాయి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!