
పుట్టపర్తి యజుర్మందిరంలో సోదాలు నిర్వహిస్తున్న కొద్దీ కోట్లాది రూపాయల విలువైన అభరణాలు, డబ్బు బయటికి వస్తూనే ఉంది.. నేడు నిర్వహించిన సోదాలో నిన్న 34 కేజీల బంగారం వెలుగులోకి వస్తే ఈరోజు కేజిన్నర బంగారం, 700 కేజీల వెండి, 33 లక్షల రూపాయల నగదు బయటపడింది.. ట్రస్ట్ సభ్యులు ఇ న్నాళ్లూ చెప్పిన లెక్కలకు భిన్నంగా కోట్లాది రూపాయల బంగారం, వెండి బయటపడుతుండడం విస్మయా నికి గురి చేస్తోంది. ఇప్పటి వరకూ దొరికిన సంపద విలువ 30 కోట్లకు పైగానే ఉంది. ఇంకా మదిరంలో సొరం గాలు ఉండొచ్చని అక్కడున్న నేలమాళిగల్లో అంతులేని సంపద ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా మరో రెండు గదులలో సోదాలు నిర్వహించాల్సి ఉంది.. అంతే కాకుండా నేలమాళిగల్లో, సొరంగాలలో కూడా సంపద ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.. మరో రెండు గదులలో సోదాలు చేస్తే మరింకెంత ధనం బయటికి వస్తుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.. కేరళలోని అనంత పద్మనాభస్వామి మందిరంలోని నేలమాళిగలలో లక్షల కోట్ల నిధి బయటికి రావడం, పుట్టపర్తిలో కోట్లాది రూపాయల నిధి బయటికి రావడం. దేశ ప్రజలకి ఆశ్చర్యంతో పాటు విస్మయాన్ని కూడా కలిగిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి