కోటి దాటుతున్న హీరోయిన్ల రెమ్యూనరేషన్లు
తెలుగు, తమిళ చిత్రాల్లో నటించే హీరోయిన్ల రెమ్యూనరేషన్లు కోటి రూపాయలు దాటుతున్నాయి. రెండు భాషల్లోనూ మార్కెట్ సంపాదిస్తే.. వారు నటించిన చిత్రాలను డబ్ చేసుకుని కూడా నిర్మాతలు అమ్ముకునే అవకాశం ఉండడంతో సక్సెస్ వస్తే చాలు హీరోయిన్లు అమాంతం తమ రెమ్యూనరేషన్‌లని పెంచేస్తున్నారు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో గోవా సుందరి ఇలియానే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి అంటూ మరికొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లోనూ ఆమెకు 1.25 కోట్ల పారితోషికం.. తీసుకుంటున్నారట. బాలీవుడ్ లో సైతం ఆమెకు ఇదే పారితోషికం లభిస్తుందని ఓ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆతర్వాత.. మంగుళూర్ కు చెందిన అందగత్తే అనుష్కషెట్టి.. కోటి రూపాయలు తీసుకుంటున్నారట. అయితే అనుష్కతో సమస్యల్లా.. ఆమె సిబ్బందికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుందట. అందువల్ల ఆమెను తెల్ల ఎనుగు అని కొందరు సినీ పండితులు అభివర్ణిస్తున్నారు. అంతేగాక ఆమెను కాంటాక్ట్ చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సూపర్ స్టార్ సాయం చేయందే ఆమెను కలుసుకోవడం కూడా కుదరదట. సన్ టీవీ అధినే...