పోస్ట్‌లు

telangana t-congress mps mls mlc saparate telangana ap political news ap political articls telangana bandh kishan reddy lakshminarayana లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సెంచ‌రీతో సంచ‌ల‌నం..

చిత్రం
సెంచ‌రీ అంటే మైదానంలో స‌చిన్‌టెండూల్క‌రో, ఎం.ఎస్ ధోనీయో త‌మ బ్యాట్‌కి ప‌ని చెప్పి వీరోచితంగా పోరాడి సెంచ‌రీ చేసార‌ని అనుకునేరు. ఇక్క‌డ సెంచ‌రీ అయ్యింది.. రాజీనామాలు.. ఇప్ప‌టికి 102 మంది శాస‌న‌స‌ భ్యులు త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసారు. నిన్న‌టి నుండి ప్రారంభ‌ మైన రాజ‌కీయ ప‌ర్వం నేడు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేలు కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మీనారాయ‌ణ‌లు త‌మ శాస‌న‌స‌భ స‌భ్య‌త్వా నికిరాజీనామా చేయ‌డంతో రాజీనామాల సంఖ్య సెంచ‌రి దాటింది. పార్టీల‌క‌తీతంగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయ‌డం బ‌హుషా ఇదే మొద‌టిసారేమో.. ప్ర‌త్యేక తెలంగాణ అంశాన్ని ఎప్ప‌టి క‌ప్పుడు ప‌క్క‌న‌పెడుతూ వ‌చ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి ఎం.పి.లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంద‌రూ పార్టీల‌క‌తీతంగా రాజీనామాలు చేయ‌డంతో దిమ్మ‌దిరిగిపోయిన‌ట్ట‌య్యింది. ఇక ఇప్పుడు ప్ర‌త్యేక తెలంగాణ ఇవ్వ‌డ‌మో, లేదా రాజీనామాల‌ని ఆమోదించి రాష్ట్ర‌ప‌తిపాల‌న‌ని విధించ‌డమో అనే రెండు ప‌రిష్కారాలు మాత్ర‌మే కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉన్నాయి.