పోస్ట్‌లు

satyavedu mla hemalatha gali muddukrishnama naidu telugu desham party chandrababu naidu ap political news ap political articls ap hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్ర‌సంగాల‌లో మాట జారితే..!?

చిత్రం
మైకు ఉందిక‌దా చేతిలో ఉంది క‌దాని కొంద‌రు నాయ‌కులు ఒంటిపై స్పృహ‌లేకుండా ప్ర‌సంగాలు దంచేస్తుంటారు.. అలాంటి స‌మ‌యంలో తాము చెప్పాల‌నుకున్న విష‌యంపై ప‌ట్టు కోల్పోయి దానికి వ్య‌తిరేకంగా మాట్లాడి ఇబ్బందు ల‌పాలు అయ్యే నాయకులు కూడా చాలా మందే ఉన్నారు.. అలాంటి కోవ‌లోకే వ‌స్తుంది చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే హేమ‌ల‌త‌.. అస‌లు విష‌యం ఏమిటంటే.. ఎమ్మెల్యే హేమలత చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అందులో ఆమె తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, భవిష్యత్తు కలిగిన పార్టీ అని జోరుగా ఉపన్యాసం ఇచ్చారు. అయితే ఇక పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురించి పొగడాలను కున్నారు.కాని నోరు జారారు. అనరాని మాట ఆమె నోటనుంచి వచ్చింది. చంద్రబాబునాయుడు అవినీతిపరుడు అని ప్రసంగంలో చెప్పేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి అని చెప్పాలనుకుని హేమలత తొందరలో అవినీతిపరుడని అనడంతో సభికులంతా అవాక్కయ్యారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరు వెల్లబెట్టారు. కాని ఆ తర్వాత ఆమె సర్దుకుపోవడానికి ప్రయత్నించారు. అది వేరే విషయం. ఈలోగా అది అ...