బాబు ఆస్తిని జగన్ కొంటాడట..
కొద్ది రోజుల క్రితం చంద్రబాబు తన ఆస్తులని ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం తనది, తన కుటుంబసభ్యలకు సంబంధించిన ఆస్తి విలువ 39 కోట్ల వరకు ఉన్నాయని బాబు చెప్పడం తెలిసిందే. అప్పట్లో ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసారు కూడా అయితే.. తాజాగా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఓదార్పు యాత్ర 22వ రోజు బుధవారం గుడివాడలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మొన్న వెయ్యికోట్లిస్తే ఆస్తి రాసిస్తానన్నావ్, ఈ రోజు నీ ఆస్తి రూ.39 కోట్లే అంటున్నావ్ అంటూ ఎద్దేవా చేశారు. రూ. 39 కోట్లు ఇస్తే నీ ఆస్తి రాసిస్తావా? అంటూ బాబుకు సవాల్ విసిరాడు కూడా.. సొంత మామను వెన్నుపోటు పొడిచి.. ఆంధ్రా హజారే అంటూ తిరుగుతున్నావ్ అంటూ ఘాటుగా విమర్శిం చారు. రైతుల సమస్యల పేరుతో ఢిల్లీ పర్యటన చేస్తూ తెర చాటున చిదంబరం, అహ్మద్ పటేల్‌తో రహస్య మంతనాలు చేసి రావడం ఎందుకు? అని ప్రశ్నించారు. చంద్రబాబు అబద్దాలకోరని, ఆయనలా అబద్దాలాడేవారు ఇండియాలోనే ఎవరూ లేరని అన్నాడు. మొత్తానికి జగన్, బాబుల మధ్య మాట...