మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ బుధవారం మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. తొమ్మిదిరోజుల పాటు రోజుకోరూపంలో అమ్మవారు దర్శనమివ్వడంతో దీంతో అంతరాలయ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు.