పద్మనాభస్వామి ఆలయ సమీపంలో భారీ పేలుడు
లక్షలకోట్ల రూపాయల సంపద బయటపడిన కేరళ, తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ సమీపంలో ఉన్న దుకాణాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు, భారీ పేలుళ్ళ శబ్దాలతో ఆలయ ప్రదేశం దద్దరిల్లింది. ఈ ఆలయం నుండి లక్షల కోట్ల నిధి బయటపడి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసింది. ఆలయంలోని 5 నేలమాళిగలలోనుండి ఈ నిధి బయటికి తీసారు. అయితే ఆరవ నేలమాళిగను తెరవడానికి ప్రయత్నించినా ఆ నేలమాళిగకు నాగబంధనం ఉందన్న తెలుసుకుని దానిని తెరిచే ప్రయత్నం విరమించుకున్నారు. మరో ప్రక్క ఆ 6వ నేలమాళిగను పరిశీలించడానికి సోమవారం నాడు నిపుణుల బృందం ఆలయానికి రాబోతున్నారు. ఈ సందర్భంలో ఈ ఘటన జరగడం అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంఘటన వెనుక కారణం ఏమై ఉంటుందన్నదాని గురించి చర్చలు మొదలయ్యాయి. 6వ నేలమాళిగని తెరిస్తే అరిష్టం అని, దాన్ని తెరిచే ఆలోచన విరమించుకోవాలని కొందరు చెప్పినప్పటికీ దాన్ని తెరవడానికి చేస్తున్న ప్రయత్నం కారణంగానే ఈ సంఘటన జరిగి...