కొడుకు శ్యాం ని వదలని మల్లెమాల..
ప్రముఖ నిర్మాత మల్లె మాల తన ఆత్మకధ లో హీరోల గురించి రాయడం ఒక ఎత్తు అయితే ,సొంత కుమారుడు నిర్మాత అయిన శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి రాయడం మరో ఎత్తు .కుమారుడని ఆయన ప్రేమ చూపలేదు.యే సందర్భం లో శ్యాం తన మనసుని గాయ పరిచాడో పేర్కొన్నారు ,చురకలు అంటించారు. మా అబ్బాయి శ్యామ్ “సౌందర్య, సురేష్, రమ్యకృష్ణ “మొదలైన తారాగణంతో ‘అమ్మోరు’ చిత్రం ప్రారంభించాడు. ఆ చిత్రానికి పేరూ ఊరూ లేని రామారావు అనే కుర్రవాడ్ని డైరక్టర్‌గా పెట్టాడు. నేనా విషయం తెలుసుకుని “కోడిరామకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్‌లో నువ్వు నిర్మించిన అన్ని చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఒకేసారి ఇద్దరినీ మార్చవలసిన అవసరం ఏమొచ్చింది “అని శ్యామ్‌నడిగాను. “రాజశేఖర్ గురించి మీకు తెలియదు నాన్నా! వాడితో పిక్చర్ తీయడంకంటే అడుక్కు తినడం మేలు. ఇక కోడి రామకృష్ణను ఎందుకు మార్చానంటారా! ఇది చాలా లో బడ్జెట్ పిక్చర్. అందువలన కోడి రామకృష్ణ వంటి పెద్ద డైరక్టర్ అక్కరలేదనుకున్నాను ” అన్నాడు. పిక్చర్ పూర్తయ్యాక రష్ చూసి అనుకున్నట్టుగా రాలేదని భావించి శ్యామ్ తిరిగి కోడి రామకృష్ణనే ఆశ్రయించాడు…’’ ‘‘..అమ్మ...