పోస్ట్‌లు

sushma swaraj telangana chidambaram kavuri sambasiva rao bjp congress new delhi saperate telangana లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్ర‌తిప‌క్ష‌నేత దేశానికా.. తెలంగాణ‌కా..

చిత్రం
కేంద్రం తెలంగాణ అన్ని అంశాలను అధ్యయనం చేసి తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని కాని భారతీయ జనతా పార్టీ నేత సుష్మ స్వరాజ్ చేసిన ప్రసంగానికి ఆక్షేపణ తెలుపుతున్నానని ఏలూరు ఎమ్.పి కావూరి సాంబశివరావు అన్నారు. 1997లో కాకినాడలో బిజెపి సమావేశమై ఒక ఓటు , రెండు రాష్ట్రాలు తీర్మానం చేసిందని ఆయన అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు అడ్డుపడుతున్నాడని చెప్పారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు కూడా లేదని , వారు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని కావూరి వ్యాఖ్యానిం చారు.కావూరి మాట్లాడుతున్నప్పడు కాంగ్రెస్ సభ్యుడు సర్వే సత్యనారా యణ అడ్డుపడడానికి యత్నించారు. ఆంద్రప్రదేశ్ లో బిజెపికి అసలు ఉనికి లేదని, వారా తెలంగాణకు మద్దతు ఇచ్చేది అని కావూరి ప్రశ్నించారు. సుష్మా స్వరాజ్ దేశానికి ప్రతిపక్ష నేతనా, లేక తెలంగాణాకా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని అన్ని పక్షాలవారి ఆమోదంతో నియమించిందని ఆయన అన్నారు. తెలంగాణ పై కేంద్రం ఏనాడు హామీ ఇవ్వలేదని కావూరి వ్యాఖ్యానించారు.

తెలంగాణ బిల్లు పెట్టాల్సిందే..!

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం ఎంత తీవ్రంగా ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ ట్టుగా ఉండ‌టం స‌హించ‌లేమ‌ని, త‌క్ష‌ణ‌మే పార్లమెంట్‌లో తెలం గాణ రాష్ట్ర బిల్లును తక్షణం ప్రవేశ పెట్టాలని BJP పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఏన్నేళ్లైనా…ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం సాధ్యం కాదని…ఈ విషయంలో పంతాలకు పోకుండా సంప్రదింపులు, ఏకాభిప్రాయం అన్న అంశాలను పక్కన పెట్టి… తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రులు ప్రణబ్‌, చిదంబరంలకు సుష్మా విజ్ఞప్తి చేశారు. తెలంగాణాపై సావధాన తీర్మానంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. తెలంగాణ చరిత్ర గొప్పదని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్ధానం నేరవేర్చుకోలేదని నెహ్రూ హయాం నుంచి 2009 డిసెంబర్‌ 9 చిదంబరం ప్రకటన వరకూ అన్ని ముఖ్య ఘట్టాలను సభలో ప్రస్తావించారు.