ప్ర‌తిప‌క్ష‌నేత దేశానికా.. తెలంగాణ‌కా..


కేంద్రం తెలంగాణ అన్ని అంశాలను అధ్యయనం చేసి తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని కాని భారతీయ జనతా పార్టీ నేత సుష్మ స్వరాజ్ చేసిన ప్రసంగానికి ఆక్షేపణ తెలుపుతున్నానని ఏలూరు ఎమ్.పి కావూరి సాంబశివరావు అన్నారు. 1997లో కాకినాడలో బిజెపి సమావేశమై ఒక ఓటు , రెండు రాష్ట్రాలు తీర్మానం చేసిందని ఆయన అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు అడ్డుపడుతున్నాడని చెప్పారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు కూడా లేదని , వారు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని కావూరి వ్యాఖ్యానిం చారు.కావూరి మాట్లాడుతున్నప్పడు కాంగ్రెస్ సభ్యుడు సర్వే సత్యనారా యణ అడ్డుపడడానికి యత్నించారు.
ఆంద్రప్రదేశ్ లో బిజెపికి అసలు ఉనికి లేదని, వారా తెలంగాణకు మద్దతు ఇచ్చేది అని కావూరి ప్రశ్నించారు. సుష్మా స్వరాజ్ దేశానికి ప్రతిపక్ష నేతనా, లేక తెలంగాణాకా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని అన్ని పక్షాలవారి ఆమోదంతో నియమించిందని ఆయన అన్నారు. తెలంగాణ పై కేంద్రం ఏనాడు హామీ ఇవ్వలేదని కావూరి వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!