ఎక్స్‌ప‌ర్ట్ వెబ్ వ‌ర్క్స్ విస్తర‌ణ‌


రెండు సంవ‌త్సరాల క్రితం ప్రారంభ‌మైన ఎక్స్‌ప‌ర్ట్ వెబ్ వ‌ర్క్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ విజ‌య‌ప‌థంలో ముందుకు సాగుతుంది. త‌న సంస్థ సేవ‌ల‌ని మ‌రింత విస్తరించే దిశ‌గా ఎక్స్‌పర్ట్ వెబ్‌వ‌ర్క్స్ సంస్థ అడుగులు ముందుకు వేసింది. త‌న క‌స్టమ‌ర్స్‌కి నాణ్యమైన సేవ‌ల‌ను అందించేందుకు, అంద‌రికీ మ‌రింత అందుబాటు లో ఉండేందుకు విశాల‌మైన భ‌వ‌నంలోకి త‌న కార్యాల‌యాన్ని మార్చింది. బంజారాహిల్స్‌లోని ఐ న్యూస్ ఆఫీస్‌కి ద‌గ్గర‌లోని నూత‌న భ‌వ‌నంలోకి నేడు త‌న కార్యాల‌యాన్ని మార్చింది. సంస్థ ఫౌండ‌ర్‌, సి.ఇ.ఓ. సోమేష్ రావు నూత‌న కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ త‌మ ఎక్స్‌ప‌ర్ట్‌వెబ్ వ‌ర్క్స్ సంస్థ దిన దిన ప్రవ‌ర్థమానంగా ఎదుగుతుంద‌ని, వెబ్ డిజైనింగ్‌లో స‌రికొత్త ఒర‌వ‌డికి నాంది వేస్తూ ముందుకి సాగుతుంద‌ని, త‌మ సంస్థ సిబ్బంది అంద‌రూ చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.  నేటి నుండి ఈ కొత్తభ‌వ‌నంలోనుండి సంస్థ కార్యక‌లాపాలు సాగుతాయ‌ని అన్నారు. త‌మ సంస్థని మ‌రింత విస్తరించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ శ్రీ తుర్లపాటి నాగ‌భూష‌ణ రావు మ‌రియు సంస్థ క‌స్టమ‌ర్స్‌,  సంస్థ సిబ్బంది సోమేష్‌రావుకి అభినంద‌న‌లు తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!