జీవితంలో శూన్యత ఏర్పడింది..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు కేవిపి రామచంద్రరావు మాటలు బహుశా తెలుగుప్రజలు టీవీల్లో విని ఉండకపోవచ్చు. ఆయనపై ఎంతటి ఆరోపణలు వచ్చినా తన సన్నిహితుల ద్వారా స్పందించమనేవారే తప్ప సొంతగా ఎప్పుడూ టివిల ముందుకు రాలేదు. అలాంటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో HMTV,ntvలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాయి. కేవీపీ గొంతు ఎలా ఉంటుందో జనానికి చూపించాయి. వైఎస్ తో తన సాన్నిహిత్యం నాజీవితంలో మర్చిపోలేనిదని, అతని లోటు ఇప్పుడు స్పష్టంగా కన్పిస్తుందని అన్నారు. మొత్తానికి చాలా మంది జర్నలిస్టులు కేవీపీకి సాన్నిహిత్యంగా ఉన్న ఆయన ఎలాగో టివిలతో మాట్లాడరనుకొని ఆయన ఇంటర్వ్యూ ఇంతకాలం తీసుకోలేకపోయిన మంచి ప్రయత్నం చేశారు. వైఎస్ తనకు మెడిసిన్ చదివే టప్పుడు రూమ్మేట్ అన్న కేవీపీ, కొన్ని విషయాల్లో వైఎస్ తో విభేదించానని చెప్పుకున్నారు. వైఎస్ లేని ఈరెండేళ్లు శూన్యంగా ఉండిపోయానని, ఆ విషయం అందరికీ తెలిసిందేనని మనసులో మాట బయటపెట్టారు.