ముగ్గురు ఆడియో విడుదల..
మూవీమోఘల్ డా. డి. రామానాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవదీప్, శ్రీనివాస్ అవసరాల, హ్యాపీడేస్ రాహుల్, రీమాసేన్, దీక్షాసేథ్, సంజన, స్వప్నలు హీరో హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ముగ్గురు. ఈ చిత్రానికి మనసంతా నువ్వే లాంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రాన్ని అందించిన వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో గురువారం నాడు రామానా యుడు స్టూడియోలో అట్టహాసంగా జరిగింది. ఆదిత్య మ్యూజిక్ వారు అందిస్తున్న ఈ ఆడియో సూపర్‌హిట్ అవుతుందని కోటి అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటుందని రామానాయుడు గారు అన్నారు. ఈ చిత్రం యూనిట్ అందరూ చిత్రం చాలా బాగా వచ్చిందని, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య చాలా బాగా చిత్రాన్ని తెరకెక్కిం చారని ప్రశంసించారు. వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ ఈ చిత్రం అతి తక్కువ రోజుల్లో షూటింగ్ జరుపుకోవడానికి ఆర్టిస్ట్‌లంతా ఎంతో సహకరించారని, ముఖ్యంగా రామానాయుడు గారు చాలా బాగా సహకరించారని అన్నారు. ఈ ఆడియో సిడిని డా. రామానాయుడు ఆవిష్కరించి నటీనటులకి అందించారు. అలాగే ముగ్గురు ద మూవీ వెబ్‌సైట్ ద్వార...