ఫేస్‌బుక్‌లో సి.ఎం. కిరణ్
ప్రపంచ నెంబర్ వన్ సోషల్ నెట్ వర్కింగ్ పోర్టల్ ఫేస్‌బుక్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి జాయిన్ అయ్యారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత అదుబాటులో ఉండటానికి వారి సమస్యలని వెంటనే పరిష్కారం చేసే అవకాశం కూడా ఉంటుందని ఈ ఫేస్‌బుక్‌లో జాయిన్ అయినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంతకు ముందు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి పేరుతో ఉన్న ఫేక్ అక్కౌంట్లని బ్లాక్ చేయనున్నారు. ఇకనుండితన ఫేస్ బుక్ ఎక్కౌంట్‌లో తాను తీసుకున్న తాజా నిర్ణయాలు, ప్రభుత్వ పథకాల గురించి వివరణ తదితర అంశాలను ఇందులో పెట్టనున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ పోర్టల్ ఇ ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు మెయిన్‌టెయిన్ చేస్తూ తమ అభిమానులకి చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా తన ఫేస్‌బుక్ ఎక్కౌంట్ ద్వారా ప్రజలకి మరింత చేరువ కావాలని అనుకుంటున్నారు. సో.. ఇక నుండి మీరు ముఖ్యమంత్రి గారితో ఏదైనా చెప్పాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఫేస్‌బుక్‌లోకి ఎంటరయిపోండి..!