పోస్ట్‌లు

shamshabad international airport jet air ways indian air ways indigo air bus news hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

శంషాబాద్‌లో విమానాలు ర‌ద్దు..

చిత్రం
హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు మూడు గంటలుగా నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టులో రాకపోకల బంద్ అయినట్లు కదనాలు వస్తున్నాయి. పది కి పైగా విమానాలను బెంగలూరుకు మళ్లించారు. కేవలం మెయిన్ టెనెన్స్ రీత్యా విమానాల రాకపోకలు కాస్త ఆలస్యం అవుతున్నాయని , విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. అయితే రన్ వే దెబ్బతినడం వల్లనే విమానాల రాకపోకలను బంద్ చేశారని చెబుతున్నారు. కాగా విమానాల రాకపోకలు నిలిచిపోవ డంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. ఇక్కడకు రావలసిన విమా నాలు కూడా రాకపోవడంతో హైదరాబాద్లో పని ఉన్న వారు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే విమానాల రాకపోకలు నిలిచిపోయాయని తెలిస్తే అది పరువు సమస్య అవుతుందని భావించిన విమానా శ్రయ యాజమాన్యం ఆ సమాచారాన్ని దాచి ఉంచడంతో ప్రయాణికులకు ఏమీ తోచని పరిస్థితి నెలకొంది. గంటల కొద్ది నిలిచిపోయిన ప్రయాణికులకు ఎప్పటిలోగా తిరిగి విమానాలు వడుస్తాయో కూడా చెప్పకపోవడంతో , వారు ఆందోళన చెందుతున్నారు.