పోస్ట్‌లు

sakshi channel sakshni paper ys jagan madhu yashki jagati publications. bharati cements hot gossips hot news cbi enquiry ys vivekananda ys vivekananda reddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అబ్బాయికి అండ‌గా బాబాయి

చిత్రం
గత ఉప ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించి,పులివెందుల ఉప ఎన్నికలో తన వదిన విజయమ్మకు వ్యతిరేకంగా పోటీచేసి మాజీ మంత్రి వై.ఎస్.వివేకానం దరెడ్డి ఇప్పుడు జగన్ కు అండగా నిలబడుతున్నట్లు న్నారు. ఆయన జగన్ ఆస్తుల కేసులో తీవ్రంగా స్పందించారు. అవినీతి తమ ఇంటా,వంటా లేదని వివేకా స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు జగన్ ను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ను దెబ్బ కొట్టేందుకు వై.ఎస్.ఇమేజీని డామేజి చేయడం బాధాకరమని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులకు జగన్ ను బాధ్యుడిని చేయడం ఏమిటని, జగన్ ఆస్తులకు సంబందం ఏమిటని వివేకానందరెడ్డి ప్రశ్నించారు. జగన్ కు పూర్తి స్థాయిలో వివేకా మద్దతు ఇస్తున్నట్లుగా ఈ ప్రకటన తెలియ చేస్తుంది.ఆస్తుల కేసులో జగన్ పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా తన బాబాయి వివేకానందరెడ్డి నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఒక రకంగా ఉపశమనంగానే భావించాలి.ఏది ధర్మమో,ఏది న్యాయమో దేవుడే నిర్ణయిస్తాడని కూడా వివేకా వ్యాఖ్యానించారు.వివేకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నప్పటికీ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తాను కూడా కాంగ్ర...