తెలుగు సినిమాకి అంత సీన్ లేదా..?
ఈరోజు జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు. వాటిలో ఒక్క తెలుగు సినిమా కూడా ఏ కేటగిరీలోనూ అవార్డు సంపాదించుకోలేకపోవడం దురదృష్టకరం. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్‌లోనే అత్యధిక సినిమాలు నిర్మాణం జరుగుతాయి. అంతే కాకుండా తెలుగు సినిమా మార్కెట్ కూడా ఎక్కువే. అందుకే బాలీవుడ్ హీరోలు తెలుగు చిత్రాలపై మోజు చూపిస్తుంటారు. అవకాశం దొరికితే ఆయా చిత్రాలని రీమేక్ చేయడానికి కూడా రెడీ అవుతారు. అంతటి పేరు ఉన్న తెలుగు సినిమా జాతీయ అవార్డుల విషయానికొచ్చే సరికి చతికిల పడిపోతున్నది. ఈసారి ఎక్కువగా మళయాల, తమిళ చిత్రాలకే ఎక్కువ అవార్డు వరించాయి. రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కి ఉత్తమ నటుడు అవార్డు వరించింది. హీందీ నుంచి ఒక్క దబాంగ్ చిత్రానికే అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించింది. భారీ బడ్జెట్టులతో సినిమాలు రూపొందించడం.. అత్యుత్తమ టెక్నాలజీని వాడుకుని సినిమాలు నిర్మాణం చేస్తున్నా జాతీయ అవార్డులు లభించలేదంటే తెలుగు చిత్ర సీమ కాస్త ఆలోచించుకోవాలి. వ్యాపారాత్మక ధోరణిని కొంత సడలి మంచి కథలతో సృజనాత్మకత ఉండే చిత్రాలని నిర్మి...