పోస్ట్‌లు

rajinikanth chennai singapoor dhanush mount elijabeth hospital baba rana robo tamilanadu news chennai hot news collywood movie news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ర‌జ‌నీ ఆరోగ్యం క‌దుట‌ప‌డింది..!

చిత్రం
కిడ్నీ సమస్యతో బాధ పడుతూ, మెరుగైన చికిత్స కోసం సింగపూర్ వెళ్లిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం కుదుట ప‌డింది.. ఆయ‌న‌ని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు. రాణా చిత్రం షూటింగ్ మొద‌టి రోజున ఆయ‌న ఆరోగ్యం పాడ‌వ‌డం, ఆ త‌ర్వాత ప‌లు ద‌ఫాలుగా హాస్పిట‌ల్స్‌లో జాయిన్ అవ‌డం, ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో హుటాహుటిన సింగ‌పూర్ లోని మౌంట్ ఎలిజ‌బెత్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించ‌డం తెలిసిందే.. నెల రోజులుగా ర‌జ‌నీ ఆరోగ్యం గురించి మీడియాలోనూ, త‌మిళ‌నాడులోనూ కొన్ని పుకార్లు షికార్లు చేసాయి. ర‌జ‌నీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింద‌ని. వాట‌న్నింటికీ తెర‌దించుతూ ఇన్నాళ్ళ‌కి ర‌జ‌నీ పూర్తిగా కోలుకుని హాస్పిట‌ల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.   అయితే ఆయన ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల మొద‌టి వారంలో గానీ చెన్నై చేరుకోనున్నారు.  ప్రస్తుతం రజనీ సింగపూర్‌లో కుటుంబీకులతో కలసి ఉుంటున్నారని కోలీవుడ్‌వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే చెన్నై రావాలని రజనీ భావించారు. అయితే కొంతకాలం ప్రయాణాలు లేకుండా విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు అక్కడే ఉండిపోయినట్లు తె...