పోస్ట్‌లు

silicon andhra anand nri news silicon andhra 10 aniversary nri corner sannivel us siicon andhra sambaram hot news special news special articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సిలికానాంధ్ర పదేండ్ల పండుగ

చిత్రం
తెలుగు సాహితీ, సంస్కృతి, సంప్రదాయ స్ఫూర్తికి ఆలవాలమైన సిలికానాంధ్ర ‘పదేండ్ల పండుగ’ అంగరంగ వైభవంగా జరిగింది.  స్థానిక సన్నీవేల్ దేవాలయ ఆవరణ, ఆగష్టు 6వ తేదీ ఈ వైభవానికి వేదిక అయ్యింది. ప్రత్యేకంగా అలంకరించిన స్వాగత ద్వారం, సాంప్రదాయ నాదస్వర సంగీతం కుటుంబ సమేతంగా విచ్చేసిన బే ఏరియాలోని తెలుగువారందరిని విశేషంగా ఆకట్టుకుంది. తెలుగువారి సంస్కృతికి అద్దంపట్టేలా కార్యక్రమం ఆద్యంతము రసవత్తరంగా సాగింది. వేదమంత్రోచ్ఛారణలతో ప్రారంభమైన కార్యక్రమానికి సిలికానాంధ్ర అధ్యక్షులు శ్రీ దీనబాబు కొండుభొట్ల స్వాగత వచనాలతో అందరినీ సాదరంగా ఆహ్వానించారు.  సిలికానాంధ్ర ప్రథమ ప్రచురణ ‘బతుకమ్మ శతకం’ విశేషాలను, ఆ శతకకర్త శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుగారు మొదటగా వివరించారు. ఆబాలగోపాలాన్ని ఆకట్టుకోనే విధంగా అందరికి అందుబాటులో ఉండే సులభమైన తెలుగులో రచించిన పద్యాలు భక్తి భావనలు ప్రేరేపించాయి. సాంఘిక, సామాజిక, ఆధ్యాత్మిక విశేషాలు పద్యాలలో స్ఫురించాయి. ఈ కార్యక్రమానికి కిరణ్ ప్రభ గారు సమన్వయకర్తగా వ్యవహరించి, శతకంలోని వివిధ దృక్కోణాలను వారి ప్రశ్నల ద్వారా శతకకర్త నుం...