పోస్ట్‌లు

lara dutta kelly dorjee mahesh bhoopati salmankhan shahrukh khan bollywood hot news bollywood gossips bollywood movie reviews bollywood hot news. లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వ్య‌క్తిగ‌త విష‌యాల జోలికి ఎందుకొస్తారు..?

చిత్రం
 అంటూ క‌స్సుబుస్సుమంటుంది మోడ‌ల్ క‌మ్ యాక్ట‌ర్, మాజీ విశ్వ‌సుంద‌రి లారాద‌త్తా. “తారల వ్యక్తిగత జీవితాల మీద మీడియా వాళ్లకి అంత ఆసక్తి ఎందుకోమరి? వాళ్ల రాతలు చిరాకు తెప్పిస్తుంటాయి. పూర్తిగా కాకపోయినా రాసేదాంట్లో కాస్తయినా నిజముండాలిగా!” అని అంటుందామె. ఆమె మీడియాపై క‌సురుకోవ‌డానికి కార‌ణం ఏమిటంటే..? అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు మహేశ్‌భూపతితో వివాహం తర్వాత కూడా నటిగా కొనసాగుతున్న మాజీ విశ్వసుందరి లారా దత్తా కొద్ది రోజుల్లో ‘బిందా యే బిందాస్ హై’ సినిమాలో సల్మాన్‌ఖాన్ సరసన కనిపించబోతోంది. అలాగే షారుఖ్‌ఖాన్ సినిమా ‘డాన్ 2′లో తన పేరు లారాతోటే నటిస్తోంది. గతంలో ఆమె నటుడు, మోడల్ కెల్లీ దోర్జీతో తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించాక విడిపోయింది. వీరిద్ద‌రి అనుబంధాల విష‌యాన్ని మీడియా క‌వ‌ర్ చేయ‌డంతో ఆమెకి కోప‌మొచ్చింది.. ఈ విష‌యాల‌న్నీ మ‌హేష్ భూప‌తికి తెలిస్తే త‌న‌ని ఎక్క‌డ త‌న్ని త‌రిమేస్తాడో అని ఆమె భ‌యం..