రాంగోపాల్‌వర్మ.. రౌడీ..!
రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్షేషన్ బెజవాడ రౌడీలు టైటిల్ వివాదం ఇప్పట్లో ముగిసేట్లు లేదు. ఈ మధ్య ఈ టైటిల్ మార్చాలంటూ విజయవాడ ప్రజలు.. ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నా యి. ఈ విషయంలో బెజవాడ ఎంపీ లగడపాటి కూడా జోక్యం చేసుకుని.. టైటిల్ మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ సినిమా ఓ లవ్ స్టోరీ అని.. స్టోరీకి టైటిల్ కు సంబంధం లేదని.. ఇటు నిర్మాత, అటు డైరెక్టర్ లు చెప్పుకొస్తున్నారు. ఇదిలాఉండగా.. మంగళవారం సెన్సార్ బోర్డు మాజీ సభ్యురాలు.. మహిళారాజ్యం మాజీ అధ్యక్షురాలు శోభారాణి ఏపీ ఫిల్మ్ చాంబర్ లో హల్ చల్ సృష్టించారు. బెజవాడ రౌడీలు టైటిల్ మార్చాలంటూ.. ఫిల్మ్ చాంబర్ లో అలజడి సృష్టించారు. ఏకంగా కుర్చీలు విసి రుతూ.. హల్ చల్ సృష్టించారు. ఎట్టిపరిస్థితుల్లో టైటిల్ మార్చాల్సిందే అని ఆమె అన్నారు. మరోవైపు దీనిపై కోపంగా.. ఓ కొత్త టైటిల్ కోసం శోభారాణి అప్లై చేసుకున్నారు. నా పేరు రామ్ గోపాల్ వర్మ, నేను ఓ రౌడీని అంటూ కొత్త సినిమా టైటిల్ కోసం ఫిల్మ్ చాంబర్ లో అప్లికేషన్ పెట్టుకుంది.