పోస్ట్‌లు

chandrababu naidu tdp national politicals lk adwani soniagandhi manmohan singh political news political gossips hot news hot gossips k tr taraka rama rao ys jagan ambati rambabu jana chetana yatra లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జ‌న‌చేత‌న యాత్రతో బిజెపి బాగుప‌డేనా..?

చిత్రం
అవినీతి, విదేశీ బ్యాంక్‌లో మూలుగుతున్న నల్లధనం భారతకు రప్పించడంలో యూపిఏ ప్రభుత్వం నిర్లక్ష్యంపై దేశ ప్రజలకు వివరించేందుకు బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ మంగళవారం ‘జన చేతన యాత్ర’ను ప్రారంభించారు. బీహార్‌లోని సితాబ్ దియరా ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభమైన సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ ఈ యాత్ర దేశ వ్యాప్తంగా 38 రోజుల పాటు సాగుతుందని, నవంబర్ 20న ఢిల్లీలో యాత్ర ముగుస్తుందని అన్నారు. తమ యాత్ర ప్రధానాంశంగా అవినీతి, నల్లధన ప్రచారస్త్రాలుగా కొనసాగుతుందని తెలిపారు. యుపీఏ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకమైన ఈ యాత్ర చరిత్రలోనే చిర స్థాయిలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఒక‌ప్పుడు అద్వానీ ర‌థ‌యాత్ర ద్వారా దేశమంతా తిరిగి బిజెపిని అధికారంలోకి తీసుకువ‌చ్చాడు.. మ‌రి.. ఈ జ‌న చేత‌న యాత్ర ద్వారా త‌మ పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చి మ‌ళ్లీ అధికారం చేప‌డ‌తారా.. ఈ యాత్రతో బిజేపి బ‌లం పుంజుకుంటుందా.. అన్నది వేచిచూడాల్సిందే..!