పోస్ట్‌లు

sridevi maheshwari gulabi anveshana telugumovies chenna news tollywood movies kollywood news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు రియాల్టీ షోలో శ్రీదేవి- మహేశ్వరి

చిత్రం
పూర్వకాల నటి మంజుల కుమార్తె శ్రీదేవి, అలాగే ప్రముఖ నటిగా వెలుగొందిన శ్రీదేవి సోదరి మహేశ్వరి తమ స్నేహ బంధాన్ని ఇంకాఇంకా పటిష్టపరుచుకుంటున్నారు. ఈ మధ్య షాపింగ్ కైనా, ఫంక్షన్ కైనా కలిసే వెళుతున్న శ్రీదేవి- మహేశ్వరి జంట ఇకపై తెలుగు రియాల్టీ షోలో కలిసే కనిపించబోతున్నారు. ఈ మధ్యనే ఓ మల్టీప్లెక్స్ లో వీరా సినిమాను వీరిద్దరూ కలిసే చూశారు. వీరా సినిమాలో రవితేజ సోదరిపాత్రని శ్రీ పోషించింది. శ్రీ చిన్నప్పటి నుంచి నటిస్తున్నా, మ్యారేజ్ తరువాత నటజీవితానికి దూరమైంది. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీదకు రావాలనుకుంటోంది. ఇక మహేశ్వరి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక ఇప్పుడు బుల్లితెరలో సెటిల్ అయింది. వీరిద్దరూ బిజినెస్ మెన్ నే పెళ్లాడారు. స్నేహం కోసం ప్రాణమిచ్చే నైజం వీరిద్దరిదీ. అందుకే వీరి ఫ్రెండ్ షిప్ బాండ్ చాలా గట్టిగా ఉంది. - దేవి (హైదరాబాద్)