త్వరలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ..?
తెలంగాణ కాంగ్రెస్ నేతలలో చీలిక వస్తుందా?కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ లేదా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొత్తపార్టీని నెల కొల్పి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నారా? వీటికి కొంతమంది ఔననే సమాధానం ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్ .ఎల్.ఎలు, ఎమ్.పిలు, ఎమ్మెల్సీలు దాదాపు తొంభై ఐదు శాతం మంది రాజీనామాలు సమర్పించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తమ దారిలోకి రాకపోవడంతో ఏమి చేయాలనేదానిపై కాంగ్రెస్ నాయకులలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ సాధనలో భాగంగా తామంతా పదవులకు రాజీనామా చేశామని,అయితే అధిష్టానం ఆ చర్యను తవ్రంగా పరిగణించి ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఈ నేపధ్యంలో ఏమి చేయాలన్నది అర్ధం కాకుండా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.అయితే ఇప్పుడున్న పరిస్థితిలో తాము రాజీనామాలను వెనక్కు తీసుకుంటే తెలంగాణ ద్రోహులన్న ప్రచారం తమపైనే పడుతుందని, అందువల్ల అవసరమైతే కొత్త పార్టీని ఏర్పాటు చేసుకుని ఉద్యమించాలని కొందరు సూచిస్తున్నారు. నల్గొండ జిల్లా కు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదరరెడ్డి వంటి వారు ఈ ప్రతిపాదనకు కొంత సానుక...