2011.. హిట్సూ.. ఫ్లాప్స్..
2012కి స్వాగతం పలుకుతూ 2011 సంవత్సరం ముగియ బోతోంది.. ఈ సందర్భంగా ఒకసారి తెలుగు చిత్రాల జయా పజయాల గురించి రివ్యూ చేస్తే… 2010 సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తెలుగు చిత్రాల విజయాలు కాస్త మెరుగ్గానే ఉన్నా తెలుగు చిత్రసీమకి ఈ విజయాలు సరిపోవు. సంవత్సరం మొదట్లో వచ్చిన స్టార్ హీరోల చిత్రాలు ఘోర పరాజయాలు కావడం అందరినీ నిరాశపరిచినప్పటికీ సంవత్సరం చివర్లో వచ్చిన చిత్రాలు వరుసగా వసూళ్ళు సాధించడంతో ఊపిరిపీల్చుకున్నారు. 2011లో మొత్త వచ్చిన తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు 114 కాగా తమిళం, కన్నడం, మళయాలం, హిందీ భాషలనుండి డబ్బింగ్ అయిన చిత్రాల సంఖ్య 120 ఉండటం విశేషం. అయితే డబ్బింగ్ చిత్రాల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ విజయాలని నమోదు చేసుకున్న చిత్రాలు మాత్రం నాలుగయిదు కంటే ఎక్కువగా లేవు. తెలుగు స్ట్రెయిట్ విషయాలకి వస్తే… ‘పరమవీరచక్ర’, ‘మిరపకాయ్’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి.. మరో బెబ్బులిపులి అంటూ విడుదలకు ముందు గాండ్రించిన పరమవీరచక్ర… పిల్లిలా కుదేలైపోయింది. దాసరి నారాయణరావు-బాలకృష్ణల క...