పోస్ట్‌లు

ys jaganmohan reddy pulivendula mangali srinu roudy sheet hot news political news political articls political hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఎమ్మెల్సీల‌పై కూడా అన‌ర్హత వేటు..?

చిత్రం
అవిశ్వాసం తీర్మానంలో పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు నిర్ణయించుకున్న కాంగ్రెసు పార్టీ తాజాగా శాసనమండలి సభ్యులపై కూడా చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతోంది. జగన్‌తో వెళుతున్న ఐదుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేలపై శాసనమండలి చైర్మన్‌కు త్వరలో కాంగ్రెసు ఫిర్యాదు చేయనుందని సమాచారం. జగన్ వర్గంలో ఉన్న కొండా మురళీ, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి, ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులపై అనర్హత పిటిషన్ చైర్మన్‌కు ఇవ్వనున్నారు. ఉదయం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునే అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యేలపై మంగళవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశముంది. మరోవైపు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం.

జ‌గ‌న్ అనుచ‌రుల‌పై రౌడీషీట్‌

చిత్రం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ముద్రపడిన ఇద్దరి పైన పులివెందుల పోలీసులు రౌడీషీట్ తెరిచారు. జగన్ ముఖ్య అనుచరుడిగా ముద్ర పడిన దంతులూరు కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పైన స్థానిక పోలీసులు రౌడీషీట్ తెరిచారు. దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో సిబిఐ మంగలి కృష్ణను విచారించడంతో ఆయన పేరు ప్రముఖంగా బయటకు వచ్చింది. హైదరాబాదులోని సూట్ కేసు బాంబు కేసు విషయంలోనూ ఆయనను విచారించారు. పులివెందులలో మంగలి కృష్ణతో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పైనా పలు కేసులు ఉన్నాయి. ఉప ఎన్నికల సమయంలో వీరిద్దరిని నగర కూడలిలోకి పిలిపించి పోలీసులు హెచ్చరించారని తెలుస్తోంది. ఆర్టీసి బస్టాండ్ వద్ద మూడు నెలల క్రితం జరిగిన ధర్నాకు సంబంధించి ఈ ఇద్దరి పైనా కేసులు నమోదయ్యాయి. ఉప ఎన్నికల సమయంలో మంగలి కృష్ణపై బైండోవర్ కేసు నమోదైంది. ఇవే కాకుండా ఇతర ప్రాంతాలలోనూ కృష్ణపై కేసు ఉన్నట్లుగా తెలుస్తోంది.