పోస్ట్‌లు

ysr congress party ys jaganmohan reddy bothsa satyanarayana ys rajashekar reddy political news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆ ప‌థ‌కాలు కాంగ్రెస్ వే..!

చిత్రం
వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు.. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీవే అని పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ స్పష్టం చేశారు. వాటిని తమ సొంత పథకాలను అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇటు జగన్ మీడియా ప్రచా రం చేయడం తగదన్నారు. జగన్ పై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తు న్నానని బొత్సా తెలిపారు. లగడపాటిపై దాడిని ఖండించిన బొత్సా.. వైఎస్ మరణాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే ఖర్మ పట్టిందని.. ఆవేదన చెందారు. వైఎస్ మరణం నుంచి కూడా జగన్ లబ్ది పొందాలని అనుకోవడం దారుణమని ఆయన అన్నారు. మరోవైపు తెలంగాణపై మాట్లాడుతూ.. చర్చల ద్వారానే సమ స్య పరిష్కారం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో సీమాంధ్ర నేతలతో కూడా చర్చలు జరుపుతానని.. చర్చల సారాంశాన్ని హైకమాండ్ కు వివరిస్తానని బొత్సా సత్యనారాయణ తెలిపారు.