అభినవ అభిమన్యుడీ జగనుడు..
జగన్ పద్మవ్యూహంలో చిక్కుకున్నప్పటికీ అభిమన్యుడు మాదిరి కాకుండా సురక్షితంగా బయటకు వచ్చి అభినవ అబిమన్యుడిగా గుర్తింపు పొందుతారని అనకాపల్లి లోక్ సభ సభ్యుడు , వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కీలక నేత సబ్బం హరి అన్నారు. ప్రభుత్వపరంగా జరిగిన భూ కేటాయింపులలో ఎక్కడా జగన్ ప్రమేయం లేదని , ఒక వేళ ఆ భూ కేటాయింపులలో ఏవైనా అవకతవకలు జరిగితే అందుకు మంత్రివర్గం మొత్తం బాధ్యత వహించవలసి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పెద్దలు కొందరు రెండు నెలల ముందు నుంచే జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ జరుగుతుందని చెబుతున్నారని, అలాగే జరిగిందని అన్నారు. హైకోర్టు కేవలం లేఖల ఆధా రంగా రాజకీయ నాయకుల ఆస్తులపై విచారణకు ఆదేశించే కొత్త సంప్రదాయానికి తెర తీసిందని,భవిష్యత్తులో కూడా హైకోర్టు ఇలానే ఇతర నాయకులపై స్పందించవలసి ఉంటుందని హరి వ్యాఖ్యానించారు. గతంలో సిబిఐ ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా ప్రతి పక్షాలు విమర్శించేవని, మరి ఇప్పుడు అవే హర్షం ప్రకటిస్తున్నాయని, దీనిబట్టే కాంగ్రెస్ టిడిపిలు కుమ్మక్కయ్యాయని అర్ధం చేసు కోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.కాగా మరో నేత అంబటి రాంబాబు నేరుగా ...