కెసిఆర్,చంద్రబాబు, జగన్ ల కుట్రా ఇది!
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కొత్త విషయం చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడా నికి కుట్ర జరుగుతోందని ఆయన అంటున్నారు.అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారు. తెలం గాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు,తెలుగుదేశం అద్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలు ఈ రాజ్యాంగ సంక్షోభానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మామూలుగా అయితే కెసిఆర్, జగన్ ల వరకు ఆయన పరిమితం చేయకుండా చంద్రబాబు ను కూడా ఆయన వీరిలో కలిపారు. రాజీనామాల వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు. రెవెన్యూ మంత్రి ఈ మధ్యకాలంలో జగన్ ను కూడా విమర్శిస్తున్నారు.గతంలో ఈయన జగన్ కోవర్టు అని జెసి దివాకరరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామా వల్ల ఉత్పప్నమైన పరిస్థితిపై మంత్రి ఆందోళన చెందినట్లు కనబడుతోంది. రాష్ట్రపతి పాలన వచ్చే ప్రమాదం ఉందని ఆయన భయపడుతున్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్ధం అవుతుంది.అందుకే రాజ్యాంగ సంక్షోభం గురించి మాట్లాడారు. ఈ రాజ్యాంగ సంక్షోభానికి కారణం ఆయన పార్టీ మంత్రులు , ఎమ్మెల్యేల కదా!