పోస్ట్‌లు

kirankumar reddy bothsa satyanarayana congress party chiranjeevi prp prajarajyam party assembly meeting political news political articls hot news special articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చిరు మ‌ద్ద‌తుతో స‌ర్కార్ నిలిచింది..

చిత్రం
అసెంబ్లీలో నిన్న జరిగిన అవిశ్వాసం తీర్మానం ద్వారా ఎవరు ఏ పార్టీ అనేది స్పష్టమైందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అవిశ్వాస పరీక్షలో చిరంజీవి మద్దతు ద్వారా పార్టీ ప్రతిష్ట పెరిగిందన్నారు. కాంగ్రెస్‌కు అండగా నిలిచిన చిరంజీవి, ఎంఐఎం పార్టీలకు బొత్స కృతజ్ఞతలు తెలిపారు. అవిశ్వాస తీర్మానం ద్వారా కరువు సమస్యపై చర్చించగలిగామని ఆయన అన్నారు. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి చేయూత నివ్వడం సంప్రదాయం కాదని బొత్స పేర్కొన్నారు. పార్టీ అదేశాలను ధిక్కరించిన వారి గురించి సీఎం కిరణ్, ప్రభుత్వ విప్ చూసుకుంటారని, వారికంటే ముందుగా తాను స్పందించడం సంప్రదాయం కాదని, వారి మాటే తన మాటని బొత్స అన్నారు. మా పార్టీని విడిచి వెళ్లిన వారి గురించి విశ్లేషించుకుంటామని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో సోనియా నాయకత్వంలో కిరణ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు, రైతాంగానికి కావల్సిన చర్యలను చేబడతామని ఆయన హామీ ఇచ్చారు.