ప్రీతీజింటా @ 21
అదేమిటీ.. ప్రీతీ జింటా వయసు 21సంవత్సరాలా..? అని ఆశ్చర్యపోతున్నారా..? వాస్తవానికి ప్రీతీజింటా వయసు 36. కానీ ఈ సొట్టబుగ్గల ముద్దుగుమ్మ 21 సంవత్సరాల అమ్మాయిలా కనిపించడానికి అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. బొద్దుగా, ముద్దుగా ఉండే ప్రీతిజింతా త్వరలో అందుకు భిన్నంగా స్లిమ్‌గా హాలీవుడ్ నటిలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. 50 సంవత్సరాల వయసు దాటినా అలా కనిపించ కుండా ఉండే మడోన్నానే ప్రీతికి ఆదర్శం.. ఇంతకీ మడోన్నా అలా కనపించకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందా అని ఆరాతీసిన ప్రీతీజింటాకి అసలు విషయం తెలిసింది.. హాలీవుడ్ తారలు మడో న్నా, గ్వినెత్ పాల్త్రో, షకీరా, జెన్నిఫర్ అనిస్టాన్, జెన్నిఫర్ లోపెజ్ తదితరులు హాలీవుడ్ సెలబ్రిటీ ట్రైనర్ ‘ట్రేసీ ఆండర్‌సన్’ దగ్గర ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆమె ఇచ్చిన ట్రైనింగ్ ద్వారానే వారు వయసు మీద పడుతున్నా.. ఆ ఛాయలు కనిపించకుండా.. నిగనిగలాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సొట్టబుగ్గల సుందరి కూడా ట్రేసీ అండర్‌సన్ దగ్గన ఫిట్‌నెస్ ట్రైనీ తీసుకోవడానికి సిద్దపడింది. ట్రేసీ ట్రైనింగ్‌తో 15ఏళ్ల వయసు తగ...