యజుర్వేదం సంపదపై పెద్దల కన్ను..
సత్యసాయి బాబా మందిరంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు నివాసం ఉన్న యజుర్వేద మందిరంపై వివాదం రగులుకుంటుంది. ఈ యజుర్వేద మందిరాన్ని సత్యసాయి బాబా మరణానంతరం మూసి వేసారు. ఈ గదిలో కోట్లాది రూపాయల విలువైన బంగారం, వజ్రాలు, పెద్ద మొత్తంలో నగదు తదితరవి నిలువ ఉన్నాయని ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు ఈ మందిరంపై కొందరు పెద్దల కన్ను పడింది. ఈ మందిరం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. ఈ మందిరం ముందు పోలీసులు కాపలా కాస్తున్నారు. అయితే ఈ మందిరంలోకి పోలీసుల కన్నుగప్పి వెళ్ళాలని ఓ సీనియర్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు, ఆయనకి ట్రస్టు సభ్యులు సహకారం అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసులకి తెలియకుండా ఆ మందిరంలోకి ప్రవేశించి కోట్లాది రూపాయల సంపదని దోచుకోవాలని వారి వ్యూహం. అయితే సత్యసాయి మరణానంతరం యజుర్వేద మందిరంపై మొదలైన వివాదాలు, అందులో కోట్లాది రూపాయల సంపద ఉందన్న ఊహలు వెల్లువెత్తుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆ మందిరాన్ని తెరిచి అసలు వాస్తవం ఏమిటో ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ...