పోస్ట్‌లు

kakinada apartment turpu godavari jilla ap kuppakoolina apartment hot news hot articls special news special articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అపార్ట్ మెంట్స్ ఎందుకు కూలుతున్నాయి?

చిత్రం
కాకినాడలోని శాంతినగర్ లోని శ్యామలాసదన్ ఆపార్ట్ మెంట్ మొదటి అంతస్థు భూమిలోకి కుంగిపోయింది. ముగ్గురు చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు ప్రాధమిక సమాచారం. అది మిడిల్ క్లాస్ కాలనీ. జీవితంలో ఓ సొంత ఇళ్లు కట్టుకోవాలని తపించేవారే ఎక్కువ. అలాంటి వారికి బిల్డర్ నాసిరకం నిర్మాణంతో ఫ్లాట్స్ అప్పగించడం ఎంత మోసం. ఈ దేశం ఎటుపోతోంది…? అపార్ట్ మెంట్ కట్టించేటప్పుడు బిల్డర్ చెప్పే `తీపి’ కబుర్లకు మిడిల్ క్లాస్ బోల్తా పడిపోతోంది. అత్యద్భుతంగా అపార్ట్ మెంట్ కట్టిస్తామని బిల్డర్ నమ్మబలుకుతున్నాడు. మధ్యతరగతి వాళ్ల మనస్తత్వం ఎంత తక్కువకు ప్లాట్ వస్తుందా అని ఉంటుందే తప్ప, నాణ్యమైన అపార్ట్ మెంట్ ఇస్తున్నాడా, లేదా అని ఆలోచించడంలేదు. పదివేలో, లేదా పాతికవేలకో తక్కువగా ఇస్తామంటే, ఆ బిల్డర్ ను పూర్తిగా నమ్మేస్తుంటారు. దీంతో సరిగా సాయిల్ టెస్ట్ లు చేయించకుండా, పునాదలు సరిగా వేయకుండానే నాసిరకంగా బిల్డింగ్ కట్టించేసి బిల్డర్ చేతులు దులుపుకుంటున్నాడు. కొస్తా ఆంధ్రలో సముద్రం పక్కన ఉండే శాండ్ శాయిల్ కు తగ్గట్టుగా తీసుకోవాల్సిన ఇంజనీరింగ్ సూచనలను, సలహాలను బిల్డర్లు ప...

కుప్ప‌కూలిన అపార్ట్‌మెంట్‌..

చిత్రం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శాంతినగర్ లో శుక్ర‌వారం సాయంత్రం ఓ అయిదు అంత‌స్థుల అపార్ట్‌మెంటు ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయింది. దీంతో చుట్టు ప‌క్క‌ల వారంతా భ‌యంతో ప‌రుగులు తీసారు. ఈ శిథిలాల క్రింద దాదాపు 25 మంది వ‌ర‌కు చిక్కుకుని ఉంటార‌ని భావిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కూ శిథిలాల చిక్కుకున్న వారిలో అయిదు మందిని ర‌క్షించ‌గ‌లిగారు. అయితే మిగ‌తా వారు ఇంకా శిథిలాల క్రిందే ఉన్నారు. సెల్లార్‌లో ఆ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ భార్య‌తోపాటు 9 మంది చిన్న‌పిల్ల‌లు ఇరుక్కుపోయారు. వీరిని ర‌క్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే జోరుగా వ‌ర్షం కురువ‌డంతో పాటు చీక‌టి ప‌డుతుండ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కి కొద్దిగా ఆల‌స్యం జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. పెద్ద పెద్ద లైట్స్‌ని ఏర్పాటు చేసి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ని వేగ‌వంతం చేస్తున్నారు. శిథిలాల మ‌ధ్య‌లో చిక్కుకుపోయిన వారు అరుపులు పెడుతుండ‌టంతో వారిని ర‌క్షించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.