షూటింగ్‌లో రాణాకు గాయాలు
ఈమధ్య సినిమా షూటింగ్‌లలో నటీనటులు గాయపడటం విరివిగా జరుగు తున్నాయి. ఆ మధ్య రాజశేఖర్ ఓయాక్షన్ సీన్‌లో నటిస్తూ గాయపడ్డారు. అలాగే కుష్భూ కూడా షూటింగ్‌లో గాయపడింది, హీరోయిన్ సమీరారెడ్డి, ఇలియానాలు కూడా షూటింగ్‌స్పాట్‌లో గాయపడ్డారు. తాజాగా రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిపార్ట్‌మెంట్ చిత్రం షూటింగ్‌లో యువ నటుడు రాణా గాయాల పాలయ్యాడు. లీడర్, నేను నా రాక్షసిసినిమాలలో రాణా హీరోగా నటించిన విషయం తెలిసిందే. డిపార్ట్‌మెంట్ చిత్రం కోసం ముంబాయి నగర శివార్లలో యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్న సందర్భంలో ఓ యాక్షన్ ఫీట్ చేస్తూ రాణా గాయపడ్డాడు. రాణా మొకాలికి, భుజానికి గాయాలయ్యాయి. వెంటనే చిత్ర యూనిట్ రాణాకి ప్రధమ చికిత్స చేసి దగ్గరలోని హాస్పిటల్‌కి తరలించారు. అయితే గాయాలు ఏమంత తీవ్రమయినవి కావని, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పడంతో చిత్ర యూనిట్ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.