పోస్ట్‌లు

t-congress leaders janareddy keshavarao ponnam prabhakar saperate telangana political news political articls political hot news jaipalreddy ktr లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జైపాల్‌రెడ్డిపై కేటీఆర్ గుస్సా..

చిత్రం
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు విరుచుకుపడ్డారు. జైపాల్ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేశారు. రిలయన్స్ కంపెనీకి మరో కంపెనీకి డీల్స్ కుదుర్చుతూ బ్రోకర్ గా ఉండడం కాదని, తాజా పరిణామాలలో జైపాల్ రెడ్డి తక్షణమే రాజీఆనమా చేయాలని ఆయన కోరారు. ఇటీవలికాలంలో జైపాల్ రెడ్డి కేంద్రంలో తెలంగాణ అంశంపై పట్టించుకున్నట్లు కనబడడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ గులాం నబీ అజాద్ సంప్రదింపుల ప్రక్రియ ఆరంభించినప్పటి నుంచి జైపాల్ తెలంగాణ నేతలతో కలిసి నడవడం లేదు. అయితే అదే సమయంలో తాను కూడా తెలంగాణవాదినేనని అన్న భావన కలిగించేందుకు ఒకటి,రెండు సార్లు ప్రయత్నించారు. ఒక సందర్భంలో ప్రధాని ని కూడా ఆయన కలిసి ఏదో ఒకటి తేల్చాలని కోరారు.ఈ దశలో జైపాల్ రెడ్డి కనుక రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నది టిఆర్ ఎస్ అభిప్రాయంగా ఉంది.ఈ నేపధ్యంలోనే జైపాల్ రెడ్డిపై కాస్త పరుషపదజాలాన్ని వాడి మరీ తారకరామారావు విమర్శలు చేశారు