పోస్ట్‌లు

dgp aravindarao dineshreddy ap political articls ap political news ap political hot news movie news special news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పోలీస్ ప్రతిష్ట మరింత పెంచుతా-దినేష్ రెడ్డి

చిత్రం
పోలీసు శాఖ ఔన్నత్యాన్నిపెంచుతానని కొత్త గా డిజిపిగా నియమి తులైన దినేష్ రెడ్డి అన్నారు.తనను డిజిపిగా నియమిం చడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞత లు తెలిపారు.తాను చిత్తశుద్దితో పని చేస్తానని, పేదవాడికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నా రు. ముఖ్యమంత్రి ఆశించిన అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన అన్నారు. పోలీసు శాఖలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఒక ప్రత్యేకత ఉందని,దానిని కాపాడతానని,పోలీసు శాఖ పతాకం మరింత పైకి ఎగిరేలా దోహదపడతానని దినేష్ రెడ్డి తెలిపారు. దినేష్ రెడ్డి డిజిపి కాగానే పలువురుఆయనకు శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనోభావాలపై సంక్షిప్తంగా వ్యాఖ్యలు చేశారు.

నో నీడ్ పాలిటిక్స్‌

చిత్రం
అని అంటున్నారు డిజిపిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర‌వింద‌రావు..  తాను రాజకీయాలలోకి రాబోనని గురువారం పదవీ విరమణ చేసిన పోలీస్ డైరెక్టర్ జనరల్ కె.అరవిందరావు చెప్పారు.అయితే పోలీసు శాఖకు తన సేవలు అందించడానికి సదా సిద్దంగా ఉంటానని ఆయన అన్నారు. కరణం కుటుంబంలో పుట్టిన తనను అదే వృత్తిలో చేరాలని కుటుంబ సభ్యులు కోరేవారని, కాని తాను ఎమ్.ఎ. చదవడంతో ఫ్రొఫెసర్ కావాలని అనుకున్నానని, కాని ఒక లెక్చరర్ సలహాతో ఐఎ ఎస్,ఐపిఎస్ పరీక్షలకు తయారయ్యి రాశానని , అందులో ఎంపిక అయ్యాయని అన్నారు. రాజశేఖరరెడ్డి దగ్గర పనిచేయడం గురించి అడిగితే, తెల్లవారు జామున రమ్మనడం వంటివి ఆయన దగ్గర లేదని, ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వెళితే సరిపోయేదని, ఆయన కంఫర్ట్ బుల్ గా ఉండి, తమను కంఫర్ట్ గా ఉంచేవారని, ఆయన తన పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లే అనిపిచే దని ఆయన చెప్పారు.ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం ఏమీ లేదని మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తున్నదని, అక్కడ గ్రామాలలో ఎవరూ ఇబ్బంది పడడం లేదని అరవిందరావు అన్నారు. తుపాకి తో రాజ్యం వస్తుందనుకోవడం సరికాదని ఆయన చెప్పారు.ముప్పైనాలుగేళ్లపాటు పోలీసు...