టైటానిక్ హీరోతో బిగ్‌బి
దాదాపు నాలుగు దశాబ్దాలుగా హిందీలో పలు చిత్రాల్లో నటించి, ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ తొలిసారి ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో తో కలసి నటించబోతున్నారు.డికాప్రియో ప్రధాన పాత్రలో నటించే చిత్రం ‘ది గ్రేట్ గాట్స్‌బీ’ చిత్రంలోకీ రోల్ కి అమితాబ్ ని ఎంపిక చేసారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కే ఈ చిత్రం త్రీడీ సినిమా. ఈ చిత్రానికి బజ్ లూర్‌మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాలో ‘టైటానిక్’ ఫేం లియోనార్డో డికాప్రియో హీరోగా నటిస్తున్నారు. బిగ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుమారు 125 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. 1925లో ఎఫ్. స్కాట్ ఫిట్‌జెరాల్డ్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నవల ఆధారంగా 1974లో ‘ది గ్రేట్ గట్జ్‌బై’ పేరుతో ఓ చిత్రం రూపొందింది. అప్పట్లో ఆ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులు, మూడు బాఫ్తా అవార్డులు, ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించాయి. ఆ తర్వాత కూడా ఈ నవల ఆధారంగా రెండు, మూడు సినిమాలు ...