పోస్ట్‌లు

sakala janula samme sakala janula sammey specialnews special articls hot news hot articls gossips kcr telangana saperate swamy goud telangana vimochana dinotsava m లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆ రెండింటిని క‌లిపితే ప‌రిష్కారం దొరుకుతుందా..?

చిత్రం
తెలంగాణ సమస్యకు ఎలాగొలా ఒక పరిష్కారం కనుగొనాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా భావిస్తున్నారు. అయితే వారు పూర్తిగా బయటపకుండా కొన్ని రాజీమార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఒకపక్క కేంద్రం ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతూనే మరో పక్క ఉద్యమం కొనసాగించే వ్యూహాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొందరు ముఖ్య నాయకులలో ఒక ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా తెలంగాణకు కలుపుకుంటే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందా అన్న ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును బాగా వ్యతిరేకిస్తున్నది ఆ రెండు జిల్లాల ప్రజలు, నాయకులన్నది ఒక అభిప్రాయం. ఎందుకంటే సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు సీమ జిల్లాలు బాగా దూరంగా ఉంటాయి. రాజధాని నగరం కోస్తాలో ఎక్కడ ఏర్పాటైనా ఈ రెండు జిల్లాలు ఒక మూలగా ఉంటాయి. అలాగని ఆంధ్ర కు రాజధానిగా ఉన్న కర్నూలు ను రాజధానిగా ఎంపిక చేస్తే మిగిలిన సీమాంధ్రకు ...

స్వామిగౌడ్‌పై హ‌త్య‌కు కుట్ర‌..?

చిత్రం
టీఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు స్వామీగౌడ్ ను చంపే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోపించారు. కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న స్వామీగౌడ్ ను కేసీఆర్ తో సహా.. గద్దర్, కోదండరామ్ తదితరులు పరామర్శించారు. తర్వాత కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. స్వామీగౌడ్ పై హత్యాయత్నం జరిగిందన్నారు. స్వామీగౌడ్ కు తగిలిన గాయాలను చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగానే గాయపర్చినట్లు తెలుస్తుందని కేసీఆర్ అన్నారు. ఈ ఘటనపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తామని కేసీఆర్ తెలిపారు. కాగా ఈ ఘటనకు కారకులైన డీసీపీ స్టీఫెన్ రవీంద్ర ను సస్పెండ్ చేయాలని.. ఆయనపై హత్యాయత్నం కింద కేసు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇక స్వామీగౌడ్ పై జరిగిన దాడికి నిరసనగా.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలన్నీ.. గాంధేయవాదంతోనే ఉండాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సమ్మె వల్ల ముఖ్యమంత్రిలో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనిపిస్తుందని కోదండరామ్ వ్యాఖ్యానించారు.