రాముడు, రావణుడు బాలయ్యే..
శ్రీరామరాజ్యం సినిమా విడుదలకు సిద్దమవుతోంది. పౌరాణిక చిత్రాలని ఎంతో భక్తి శ్రద్దలతో, ఎంతో కళాత్మకంగా తెరకెక్కిస్తాడని పేరున్న బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మధ్యే రిలీజయిన శ్రీరామరాజ్యం పాటలు చాలా బావున్నాయన్న టాక్ వచ్చేసింది. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ సాంగ్స్ అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల పాటల మాదిరే అందరినీ ఆకట్టుకుంటున్నా యన్న పాజిటివ్ టాక్ శ్రీరామరాజ్యం సినిమాపై మరింత ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాయి. ఈ చిత్రంలో నందమూరి బాలయ్య రాముడుగా నటిస్తున్నాడని తెలిసిందే.. అయితే తాజాగా ఈ చిత్రంలో బాలయ్య మరో పాత్రని కూడా పోషిస్తున్నాడని, బాలయ్య రాముడిగానే కాకుండా, రావణుడిగా కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడని నందమూరి అభిమానులు ఊహిస్తున్నారు. బాలయ్య రాముడుగా, రావణుడుగా రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నారన్న వార్తని బాలయ్య అభిమానులు లీక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రాముడి గెటప్‌లో వచ్చిన బాలయ్య స్టిల్స్ చూసి నందమూరి వంశ అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు. రాముడు గెటప్‌లో అచ్చు తన తండ్రి ఎ...